ఎన్‌ఆర్‌ఈసీలో ప్రాంగణ నియామకాలు

ABN , First Publish Date - 2022-12-07T23:33:45+05:30 IST

గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ మైసమ్మగూడలో గల నర్సింహారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో బుధవారం టీవీఎస్‌ బహుళ జాతీయ సంస్థ ప్రాంగణ నియామకాలు నిర్వహించింది.

ఎన్‌ఆర్‌ఈసీలో ప్రాంగణ నియామకాలు

టీవీఎస్‌ సంస్థలో ఉద్యోగాలకు 24 మంది విద్యార్థుల ఎంపిక

మేడ్చల్‌, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ మైసమ్మగూడలో గల నర్సింహారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో బుధవారం టీవీఎస్‌ బహుళ జాతీయ సంస్థ ప్రాంగణ నియామకాలు నిర్వహించింది. ఈ నియామకాల్లో భాగంగా పలు బ్రాంచీల విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మొత్తం 24 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో మెకానికల్‌ నుంచి 16 మంది, ఈఈఈ నుంచి 4గురు, సివిల్‌, ఈసీఈ నుంచి ఇద్దరు చొప్పున ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు ఎలక్ట్రికల్‌ వాహనాలపై కూడా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులను కళాశాల చైర్మన్‌ నర్సింహారెడ్డి, సెక్రటరీ త్రిశూల్‌రెడ్డి, కోశాధికారి త్రిలోక్‌రెడ్డి, డైరెక్టర్‌, ప్రిన్స్‌పాల్‌ తదితరులు అభినందించారు.

Updated Date - 2022-12-07T23:33:46+05:30 IST