మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-05-29T06:09:00+05:30 IST

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే
ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేస్తున్న మాసూమ్‌, నాయకులు


ఆమనగల్లు, మే28: మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. ఆమనగల్లు జామామజీద్‌ అధ్యక్షుడు ఎండీ మాసూమ్‌ ఆధ్వర్యంలో శనివారం మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేను హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి నిధుల మంజూరు, శ్మశాన వాటికకు స్థలం కేటాయింపు, అసంపూర్తిగా ఉన్న షాదీఖానా నిర్మాణపనులపూర్తి, మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు గురించి మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మాసూమ్‌, రజాక్‌, జబ్జాబర్‌, బాబాషర్పోద్దీన్‌, ఖుద్దూష్‌, నయీమ్‌, షర్పద్దీన్‌, వహీద్‌, అప్జల్‌, పాష, బాబా, అక్తర్‌, తాహేర్‌, జహంగీర్‌, ఆరీఫ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T06:09:00+05:30 IST