ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీ అభివృద్ధి

ABN , First Publish Date - 2022-12-31T23:58:06+05:30 IST

మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌ తెలిపారు.

ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీ అభివృద్ధి

ఆమనగల్లు, డిసెంబరు 31: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌ తెలిపారు. నుచ్చుగుట్ట తండాలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.25 లక్షలతో సీసీ రోడ్డు, రూ.15లక్షలతో డ్రైనేజీ, 11వ వార్డులో రూ.20లక్షలతో డ్రైనేజీ పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులను శనివారం ఎన్‌బీసీ మాజీ సభ్యుడు ఆచారి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, కౌన్సిలర్‌ బైకని యాదమ్మశ్రీశైలం యాదవ్‌లతో కలిసి రాంపాల్‌ నాయక్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చెక్కాల లక్ష్మణ్‌, చెన్నకేశవులు, దుడ్డు కృష్ణయాదవ్‌, నాయకులు గోరటి నర్సింహ, సీతారామ్‌ నాయక్‌, శ్రీకాంత్‌ సింగ్‌, వెంకటేశ్‌, శ్రీను, గిరి, రాములు, నర్సింహ, పర్వతాలు, నారాయణ, పెద్దయ్య, మల్లేశ్‌, సత్తయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:58:06+05:30 IST

Read more