కసితోనే తల్లీకూతుళ్ల హత్యకు పథకం

ABN , First Publish Date - 2022-10-17T05:30:00+05:30 IST

కసితోనే తల్లీకూతుళ్ల హత్యకు పథకం

కసితోనే తల్లీకూతుళ్ల హత్యకు పథకం
వివరాలు వెల్లడిస్తున్న సీఐ తిరుపతిరాజు

  • నిందితుడిని జైలుకు తరలింపు 
  • వెల్లడించిన సీఐ తిరుపతిరాజు

ధారూరు, అక్టోబరు 17: తనకు దక్కని యువతి వేరేవారికి దక్కకూడదనే పగ, కసితోనే తల్లీకూతుళ్లపై పెట్రోల్‌ పోసి నిప్పటించి చంపాలని నిందితుడు రాకే ష్‌  ప్రయత్నించాడని పోలీసు విచారణలో తేలింది. నిందితుడిని కోర్టులో హాజరు పరి చి రిమాండుకు తరలించారు. ఈ కేసుకు సబంధించి ధారూరు సీఐ తిరుపతి రాజు సోమవారం వివరాలు వెల్లడించారు. గడ్డమీది గంగారానికి చెందిన గొల్ల రాకే్‌షకు అదే గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో రాకేష్‌ ప్రవర్తన నచ్చని యువతి.. అతడిని పెళ్లి చేసుకోనని చెప్పి తెగదెంపులు చేసుకుంది. యువతి తననే పెళ్లి చేసుకోవాలని, లేదంటే చంపేస్తానని రాకేష్‌ కసితో నాలుగురోజల క్రితం వికారాబాద్‌లో బైక్‌ ట్యాంకులో పెట్రోల్‌ నింపుకొని, అందులో నుంచి బాటిల్‌లో పెట్రోల్‌ తీశాడు. పెళ్లికి నిరాకరిస్తున్న యువతిని చంపాలని నిర్ణయించుకొని.. పెళ్లి చేసుకోవాలని మరోసారి అడిగేందుకు ఆదివారం రాకేష్‌ యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకుంటావా? లేదా? అని యువతిని అడిగాడు. పెళ్లి చేసుకోను అని ఆమె తెగేసి చెప్పటంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను యువతిపై పోశాడు. గమనించిన ఆమె తల్లి రాకే్‌షను అడ్డుకోగా అమెపైనా పెట్రో ల్‌ పోసి నిప్పటించేందుకు యత్నించాడు. వారు అరవడంతో చుట్టుపక్కల వారు పరుగున రాగా రాకేష్‌ పారిపోయాడు. హత్యకు యత్నించిన రాకే్‌షను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నామని సీఐ తిరుపతిరాజు వివరించారు.

Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST