సమస్యలపై గళమెత్తిన ప్రజాప్రతినిధులు

ABN , First Publish Date - 2022-10-18T05:26:43+05:30 IST

సమస్యలపై గళమెత్తిన ప్రజాప్రతినిధులు

సమస్యలపై గళమెత్తిన ప్రజాప్రతినిధులు
ఏపీఎం సురే్‌షను నిలదీస్తున్న ఎంపీటీసీ సభ్యుడు రవీందర్‌

ధారూరు, అక్టోబరు 17: గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. మండల పరిషత్‌లో సోమవారం ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందిరాక్రా ంతి కార్యక్రమాలకు తమను అహ్వానించడం లేదని మున్నూర్‌ సోమా రం ఎంపీటీసీ రవీందర్‌ ఏపీఎం సురే్‌షను నిలదీశారు. విద్యుత్‌ సమస్య లు ఉన్నాయని, ట్రాన్స్‌కో అధికారులు సమావేశానికి రాకుంటే సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలని కేరెల్లి ఎంపీటీసీ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఉపాధి పనుల కూలి నేటికీ కూలీలకు ఇవ్వలేదని గడ్డమీది గంగారం సర్పంచ్‌ అమర్‌నాథ్‌ ఏపీఎంను నిలదీశారు. నూతన సా ఫ్ట్‌వేర్‌తో సమస్య తలెత్తిందని, కూలీల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని ఏపీఎం తెలిపారు. తండాలో ఒకే వాటర్‌ ట్యాంక్‌ ఉందని, దానితో నీటి సరఫరా సరిగా కావడం లేదని పీసీఎం తండా సర్పంచ్‌ సునీత తెలిపారు. గైర్హాజరైన అధికారులపై జడ్పీకి నివేదిక ఇస్తామని ఎంపీపీ విజయలక్ష్మి తెలిపారు. సమావేశానికి చాలా మంది సర్పంచు గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో వైస్‌ఎంపీపీ విజయ్‌కుమార్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వీరేశం, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పి.బసప్ప, ఏఎంసీ చైర్మన్‌ సంతో్‌షకుమార్‌, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:26:43+05:30 IST