పెండింగ్ స్కాలర్‌షిప్‌లు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-12-16T23:54:18+05:30 IST
పెండింగ్ స్కాలర్‌షిప్‌లు,ఫీజురీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని పీడీఎ్‌సయూ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్‌రెడ్డి అన్నారు.
తాండూరు/వికారాబాద్, డిసెంబరు 16: పెండింగ్ స్కాలర్‌షిప్‌లు,ఫీజురీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని పీడీఎ్‌సయూ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. దీపక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజు దోపిడీని అరికట్టాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థు లు, పీడీఎ్‌సయూ నాయకులు ప్రకాష్, నరేష్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.3,500కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని పీడీఎ్‌సయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొజ్జ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. వికారాబాద్‌లో ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు విన తిపత్రమిచ్చారు. పేదవిద్యార్థులు స్కాలర్‌షిప్ మీదే ఆధారపడ్డారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం అంద జేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రభావతి, నాయకురాలు వై.గీత మహేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.