నేడు పరిగికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-06-10T06:30:39+05:30 IST

నేడు పరిగికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

నేడు పరిగికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి

  • డిజిటల్‌ మెంబర్‌షిప్‌ కార్డుల అందజేత : డీసీసీ అధ్యక్షడు టీఆర్‌ఆర్‌

పరిగి, జూన్‌ 9: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి శుక్రవారం పరిగికి రానున్నారు. డిజిటల్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆయన కార్డుల ను అందజేస్తారు. ఈ మేరకు గురువారం డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి విలేకరు లకు వెల్లడించారు. రేవంత్‌రెడ్డితోపాటు, ఏఐసీసీ డేటా అనలిస్ట్‌ చైర్మన్‌ ప్రవీణ్‌చక్రవర్తి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మెంబర్‌షిప్‌ నేషనల్‌ కో-ఆర్డినేటర్‌ దీపక్‌ జాన్‌, తెలంగాణ ఇర్‌చార్జి వేణుగోపాల్‌, మాజీ మంత్రి పసాద్‌కుమార్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేశ్‌, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పార్టీ కొడంగల్‌ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి పాల్గొంటారని తెలిపారు. నవసంకల్ప్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాల మేరకు జిల్లా శిబిర్‌ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మేథోమథనంలో పేర్కొన్న ఆరు ఆంశాలపై కమిటీలు వేసి అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. రేవంత్‌ కా ర్యక్రమానికి జిల్లా, పరిగి నియోజకవర్గ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఎన్రోలర్లు తప్పక హాజరుకావాలన్నారు. నాయకులు బి.భీంరెడ్డి, ఎం.లాల్‌కృష్ణ, అశోక్‌, ఇ.కృష్ణ, బి.పరశురాంరెడ్డి, సురేందర్‌, విజయ్‌కుమార్‌రెడ్డి, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-10T06:30:39+05:30 IST