వీఆర్‌ఏలకు పేస్కేలు అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-08-04T05:47:51+05:30 IST

వీఆర్‌ఏలకు పేస్కేలు అమలు చేయాలి

వీఆర్‌ఏలకు పేస్కేలు అమలు చేయాలి

పరిగి/బొంరాస్‌పేట్‌/కులకచర్ల/బషీరాబాద్‌, ఆగస్టు 3 :    వీఆర్‌ఏలకు పేస్కేలు అమలు చే యాలని  దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్‌ రవీందర్‌మహారాజు  డిమాండ్‌ చేశారు. వీఆర్‌ఏలు తలపెట్టిన నిరవధిక సమ్మెకు దళిత శక్తి ప్రోగ్రాం ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.వీఆర్‌ఏలకు ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సిద్దిఖీమియా, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.  అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా వీఆర్‌ఏలు డిమాండ్‌ చేశారు. బొంరాస్‌పేట్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 

  • కులకచర్లలో వీఆర్‌ఏల వినూత్న నిరసన

వీఆర్‌ఏలు సమ్మెలో భాగంగా కులకచర్లలో వినూత్నంగా నిరసన తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పారిశుధ్య పనులు చేపట్టారు. కార్యాలయం చుట్టూ చెత్తను తొలిగించారు. కార్యక్రమంలో వీఆర్‌ఏలు ఓంప్రకాశ్‌, వెంకట్‌, రమేశ్‌, అనిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. కాగా, వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఎస్టీసెల్‌ బషీరాబాద్‌ మండల నాయకులు గోపాల్‌నాయక్‌ పేర్కొన్నారు. బషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపడుతున్న వీఆర్‌ఏల దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈకార్యక్రమంలో కాశీంపూర్‌ మాజీ ఉపసర్పంచ్‌ రామునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:47:51+05:30 IST