అనంతగిరికి చేరుకున్న పద్మనాభస్వామి
ABN , First Publish Date - 2022-10-08T04:21:21+05:30 IST
అనంతగిరికి చేరుకున్న పద్మనాభస్వామి
వికారాబాద్, అక్టోబరు7: దసరా ఉత్సవాల్లో భాగంగా అనంతగిరి నుంచి వికారాబాద్ ఆలంపల్లికి వచ్చిన శ్రీ అనంతపద్మనాభ స్వామి ఉత్సవాలు ముగించుకుని తిరిగి శుక్రవారం అనంతగిరికి చేరుకున్నారు. స్వామి వారికి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతగిరిపల్లి మీదుగా స్వామివారు పల్లకీలో వెళ్తుండగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో చైర్ పర్సన్ మంజుల పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.