వందశాతం పన్నులు వసూలు చేయాలి

ABN , First Publish Date - 2022-12-16T23:14:30+05:30 IST

ప్రభుత్వ పఽథకాల నిర్దేశిత లక్ష్యాల పూర్తికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి కోరారు.

వందశాతం పన్నులు వసూలు చేయాలి
పనులను పరిశీలిస్తున్న డీపీవో శ్రీనివాస్‌రెడ్డి

జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి

తలకొండపల్లి, డిసెంబరు 16: ప్రభుత్వ పఽథకాల నిర్దేశిత లక్ష్యాల పూర్తికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈ నెల చివరి నాటికి పన్నుల వసూళ్లు నూరు శాతం పూర్తి చేయాలని ఆయన సూచించారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్‌ గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పారిశుధ్య పనులు, డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణంతోపాటు గ్రామంలో నిర్వహిస్తున్న అభివృద్ధి సనులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా రూ.40 లక్షలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బొజ్జ వెంకట్రామిరెడ్డి, ఎంపీవో రఘు, పంచాయతీ కార్యదర్శి అలివేలు ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:14:32+05:30 IST