యుద్ధభూమిలో నిద్రలేని రాత్రులు గడిపాం
ABN , First Publish Date - 2022-03-06T04:31:43+05:30 IST
యుద్ధభూమిలో నిద్రలేని రాత్రులు గడిపాం
- ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థిని సుప్రజ
- ఐదు రోజులు బంకర్లలో తలదాచుకున్నట్టు వెల్లడి
ఆమనగల్లు, మార్చి 5: ‘‘ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం నేపథ్యం లో ఐదు రోజుల పాటు బంకర్లలో భయం భయ ంగా తలదాచుకు న్నాం. నిద్రలేని రాత్రులు గడిపాం. స్వదేశానికి వెళ్లి మా వాళ్లను చూస్తామో లేదో అనుకున్నాం.’’ అని వైద్య విద్యార్థిని సుప్రజ తెలిపింది. రంగారెడ్డి తలకొండపల్లి మండలం చు క్కాపూర్ గ్రామానికి చెంది న మాకం వీరేశ లింగం-రమాదేవిల కూతురు సుప్రజ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని బోగో మోలెట్స్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతోంది. శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సుప్రజ తల్లిదండ్రులను కలుసుకొని భావోద్వేగానికి లోనైంది. ఆమె మాట్లాడుతూ.. ఉక్రెయిన్-రష్యాల మధ్య నేపథ్యంలో మొదటి రోజే కీవ్‌పై బాంబుల దాడి జరిగిందని తెలిపింది. ఈనేపథ్యంలో కాలేజీ వసతి గృహంలో ఉంటున్న 650వైద్య విద్యార్థుల ంతా ఆందోళనకు గురయ్యామంది. అధికారుల సూచనల మేరకు కళాశాలలోని బంకర్లలో ఐదు రోజులు తలదాచుకున్నామని తెలిపింది. ఆ తర్వాత భారత ఎంబసీ అధికారుల సూచన మేరకు హాస్టల్‌కు దగ్గరలోని రైల్వే స్టేషన్‌కు గతనెల 28న చేరుకొని అక్కడి నుంచి రైల్లో 22గంటలు ప్రయాణించి 1న రాకీవ్ నగరానికి చేరుకున్నట్లు చెప్పింది. అక్కడి నుంచి రెండు గంటలు బస్సులో ప్రయాణించి స్లోవేకియా సరిహద్దుకు చేరుకొని భారత ఎంబసీ అధికారులను కలుసుకున్నట్లు చెప్పింది. రెండు రోజుల అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నామని, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమను రిసీవ్ చేసుకుని తెలంగాణ భవన్‌లో ఉంచారంది. శనివారం ఉదయం విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నామని సుప్రజ వివరించింది. తమ కూతురు క్షేమంగా ఇంటికి చేరడానికి సహకరించిన భారత, తెలంగాణ ప్రభుత్వాలకు తల్లిదండ్రులు వీరేశలింగం, రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు.