19న మేడ్చల్‌లో బొడ్రాయి పున:ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2022-12-15T00:17:34+05:30 IST
మేడ్చల్ పట్టణంలో ఈనెల 19న బొడ్రాయి పున:ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి తెలిపారు.
మేడ్చల్ అర్బన్, డిసెంబరు 14: మేడ్చల్ పట్టణంలో ఈనెల 19న బొడ్రాయి పున:ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ ఈనెల 15 నుంచి 19 వరకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గురువారం గణపతి పూజ, పుణ్యవచనం, మంటపారాధనతో పున:ప్రతిష్ఠ ప్రారంభమవుతుందని చెప్పారు. శుక్రవారం మంటపపూజ, అగ్ని ప్రతిష్ఠాపన, చండీహోమం, బొడ్రాయి ఊరేగింపు, జలాధివాసం, శనివారం పుష్పాధివాసం, ధాన్య, ఫల, శయ్యదివాసం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆదివారం బొడ్రాయి ప్రతిష్ఠ, గ్రామ దేవతలకు బోనాల సమర్పణతో కార్యక్రమం ముగుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.