నూనె దినుసులు సాగు చేయాలి
ABN , First Publish Date - 2022-10-18T05:29:08+05:30 IST
నూనె దినుసులు సాగు చేయాలి
షాబాద్, అక్టోబరు 17: రైతులు నూనె దినుసుల సాగుపై దృష్టిసారించాలని శాస్త్రవేత్తలు డాక్టర్ సతీ్‌షకుమార్, డాక్టర్ ప్రసాద్‌లు అన్నారు. ముద్దెంగూడ గ్రామంలో సోమవారం సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం రాజేంద్రనగర్, హైదరాబాద్ వారి సహకారంతో 150 మంది రైతులకు కుసుమ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రత్నాకర్, ఏవో వెంకటేషం, ఎస్‌బీఐ మేనేజర్ సరస్వతీ, సర్పంచ్ కుర్వ జయమ్మసుదర్శన్, మాజీ ఎంపీపీ కూర వెంకటయ్య, మాజీ సర్పంచ్ రాజు, గ్రామస్థులు పాల్గొన్నారు.