పంటల పరిశీలన

ABN , First Publish Date - 2022-09-20T04:49:06+05:30 IST

మండల పరిధిలోని పోలెపల్లిలో

పంటల పరిశీలన
రైతుతో మాట్లాడుతున్న ఏవో

ఆమనగల్లు, సెప్టెంబరు 19: మండల పరిధిలోని పోలెపల్లిలో సోమవారం మండల వ్యవసాయ శాఖ అధికారి అరుణ కుమారి పర్యటించారు. ఈసందర్భంగా పంటల నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం చీడ పీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు సాగులో పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో శివతేజ, ఎట్టయ్య, లాలు పాల్గొన్నారు. Read more