నర్సరీలను సంరక్షించాలి : జడ్పీ సీఈవో

ABN , First Publish Date - 2022-05-25T05:24:40+05:30 IST

నర్సరీలను సంరక్షించాలి : జడ్పీ సీఈవో

నర్సరీలను సంరక్షించాలి : జడ్పీ సీఈవో

వికారాబాద్‌, మే 24 : నర్సరీలను సంరక్షించుకుంటూ ఎప్పటికప్పుడు నీటిని అందించాలని జడ్పీ సీఈవో జానకిరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్‌ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో అధికారులతో నర్సరీ, వైకుంఠధామం, కంపోస్ట్‌ యార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సుభాషిణి, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.

Read more