వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2022-10-12T05:04:59+05:30 IST

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందించడంలో

వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదు
మాట్లాడుతున్న డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు

కందుకూరు, అక్టోబరు 11 : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయరాదని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వరావు అన్నారు.  కందుకూరు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆశావర్కర్లు, వైద్యసిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, మహిళలు, తల్లులు, పిల్లలకు సకాలంలో వ్యాక్సిన్‌ వేయాలన్నారు. ముఖ్యంగా పీహెచ్‌సీ కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ గీత, అరుణ, స్వర్ణకుమారి, మండల వైద్యాధికారులు, డాక్టర్లు రాఽధిక, రాజ్‌కుమార్‌, హరినాథ్‌ పాల్గొన్నారు.Read more