మంత్రులకు నాయకుల దసరా శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-10-08T05:21:00+05:30 IST

మంత్రులకు నాయకుల దసరా శుభాకాంక్షలు

మంత్రులకు నాయకుల దసరా శుభాకాంక్షలు
మేడ్చల్‌ : మంత్రి మల్లారెడ్డికి పుష్ఫగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న జగన్‌రెడ్డి తదితరులు

మేడ్చల్‌/శామీర్‌పేట/ఘట్‌కేసర్‌/దోమ, అక్టోబరు 7 : మంత్రి మల్లారెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో మేడ్చల్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రిని కలిసి శాలువాలతో సత్కరించి పూలబొకేలు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ సర్పంచ్‌లు జగన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌గౌడ్‌, నాయకులు సింహ్మాలుయాదవ్‌, రాజేందర్‌ముదిరాజ్‌, గౌస్‌ఖాన్‌ తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డికి మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి సర్పంచ్‌ యాంజాల అనురాధా రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకులు నల్ల కృష్ణారెడ్డి, బలవంతరెడ్డి, రాజిగల్ల నవీణ్‌, యాదగిరి, ప్రవీణ్‌, మహేష్‌, వెంకటేష్‌, శ్రీనివా్‌సరెడ్డి, కొండల్‌రెడ్డి, జైహింద్‌రెడ్డి తదితర నాయకులు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే శామీర్‌పేట పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌, ఎస్‌ఐ రవిలకు ఉద్దెమర్రి సర్పంచ్‌ యాంజాల అనురాధా రవీందర్‌రెడ్డి కలిసి సన్మానించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. మాజీమంత్రి టి.దేవేందర్‌గౌడ్‌ను ఘట్‌కేసర్‌ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం తుక్కుగూడలోని  ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఘట్‌కేసర్‌ మండలంలోని ప్రతాపసింగారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్‌రెడ్డిని సైతం కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపినట్లు టీడీపీ మండలాధ్యక్షుడు వేముల సంజీవగౌడ్‌ తెలిపారు. కార్యక్రమాల్లో సామాల జగన్‌మోహన్‌రెడ్డి, వేణుగోపాల్‌, సిస్టా సూర్యనారాయణ, గుర్జకుంట చంద్రయ్య, టి.మహేష్‌, పాటి సురేందర్‌రెడ్డి, మడ్డి రాములు తదితరులు పాల్గొన్నారు.

అలాగే దోమ మండల పరిధిలోని ఐనాపూర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు దసరాను పురస్కరించుకొని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రతీమారెడ్డి, జడ్పీటీసీ నాగిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వారితో రుక్మయ్యగౌడ్‌, రాములు, అంజిలయ్య, సాయిలు, అంజి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి టీఆర్‌ఎస్‌ నాయకులు వడ్ల నందు దసరా శుభాకాంక్షలు తెలిపారు.


Read more