జాతీయ రహదారి పనులు షురూ

ABN , First Publish Date - 2022-12-16T23:44:38+05:30 IST

మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారి పనులను జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు.

జాతీయ రహదారి పనులు షురూ
పనులను ప్రారంభిస్తున్న జంగారెడ్డి, సురేందర్‌రెడ్డి

కందుకూరు, డిసెంబరు 16: మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారి పనులను జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు సమస్యపై మంత్రి సబితారెడ్డి స్పందించి రూ.33లక్షల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. రహదారిపై ఎడమ వైపు గతంలో డ్రైనేజీ వేయగా కుడివైపు స్థానికులు అభ్యంతరం తెలపడంతో పనులు నిలిచిపోయాయి. పది రోజులుగా స్థానికులతో మాట్లాడి అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను ప్రారంభించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా కొత్తగూడ గ్రామ పంచాయతీలో డ్రైనేజీ పనులకు అదనంగా నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి హామీ ఇచ్చినట్లు జంగారెడ్డి స్థానికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, కొత్తగూడ సర్పంచ్‌ సాధ మల్లారెడ్డి, నాయకులు జిట్ట రాజేందర్‌రెడ్డి, ఎస్‌.జైపాల్‌రెడ్డి, బొక్క సత్యనారాయణరెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, బర్కం వెంకటేశ్‌, విజయేందర్‌, జాతీయ రహదారుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:44:39+05:30 IST