మార్మోగిన అయ్యప్ప నామస్మరణ

ABN , First Publish Date - 2022-11-25T00:06:59+05:30 IST

మున్సిపాలిటీలోని ఈశ్వర అభయాంజనేయస్వామి ఆలయం బుధవారం రాత్రి అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఏడవ వార్డు కౌన్సిలర్‌ సలేంద్రం రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
షాద్‌నగర్‌ అర్బన్‌: పడిపూజలో పూజ చేస్తున్న గురుస్వామి సతీషన్‌ నాయర్‌

షాద్‌నగర్‌ అర్బన్‌/యాచారం, నవంబరు 24: మున్సిపాలిటీలోని ఈశ్వర అభయాంజనేయస్వామి ఆలయం బుధవారం రాత్రి అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఏడవ వార్డు కౌన్సిలర్‌ సలేంద్రం రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురుస్వామి సతీషన్‌ నాయర్‌ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సలేంద్రం రాజేశ్వర్‌తో పాటు కాలనీకి చెందిన ఎం.గోపాల్‌రెడ్డిలు పడిని వెలగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌, జడ్పీటీసీ సభ్యుడు పి.వెంకట్‌రాంరెడ్డి, బీజేపీ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కాలనీ ప్రముఖులు మేడిగ పెంటయ్య, ఎల్‌.మోహన్‌రెడ్డి, ఎం.వెంకట్‌రెడ్డి, జి.మల్లే్‌షగౌడ్‌, శేఖర్‌గౌడ్‌, శ్రీశైలం, దర్శన్‌, భాస్కర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం మండలంలోని మల్కీజ్‌గూడలో గురువారం శ్రీ అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా జరిగింది. పూజలో పీసీసీ కార్యదర్శి రాంరెడ్డి పాల్గొన్నారు.

ముగిసిన ఆకుపూజ మహోత్సవం

ఆమనగల్లు/మాడ్గుల/కేశంపేట/కొత్తూర్‌: ఆమనగల్లు పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీఅభయాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించిన ఆకుపూజ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్బంగా హనుమాన్‌ పూజలు, కార్తీక భజనలు, హనుమాన్‌ పారాయణం కార్యక్రమాలు భక్తిశ్రద్దలతో నిర్వహించారు. అభయాంజనేయ భజన మండలి సభ్యులను సన్మానించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అభయాంజనేయ భజన మండలి సభ్యులు నారాయణరావు, అంజయ్య, సత్యనారాయణ, బుచ్చిరాములు, దామోదర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా నారాయణపూర్‌లో శ్రీనునాయక్‌ ఆధ్వర్యంలో గురువారం హనుమాన్‌ పడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచ్‌ గోరటి శ్రీను, నాగులు నాయక్‌, శివకుమార్‌, రాజశేఖర్‌, సుమన్‌ నాయక్‌, వినోద్‌ నాయక్‌, గణేశ్‌, గిరి పాల్గొన్నారు. అదేవిధంగా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో హనుమాన్‌ శోభాయాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తాండ్ర విష్ణువర్ధన్‌రెడ్డి, నరేందర్‌ భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్‌ మండలంలోని గూడూర్‌ గ్రామంలోని హనుమాన్‌ ఆలయంలో అన్నదానం చేశారు. ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎమ్మె సత్యనారాయణలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

శివాలయానికి గోదానం

శంకర్‌పల్లి: చందిప్పలో గల మరకత శివాలయానికి మహరాజ్‌పేట్‌ మాజీ ఉపసర్పంచ్‌ తొండ రవి గోమాతను దానం చేశారు. అదేవిధంగా మాచన్నగారి లక్ష్మారెడ్డి సోమేశ్వర శివాలయంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, రామంతాపూర్‌ మాజీ సర్పంచ్‌ నర్సింలు, శ్రీనివాస్‌, ప్రశాంత్‌రెడ్డి, కాంత్‌రెడ్డి, మహేష్‌ పాల్గొన్నారు.

ఎల్లమ్మ గుడి నిర్మాణానికి సహకరించాలి

మాడ్గుల: నల్లచెర్వు గ్రామంలో ఎల్లమ్మ గుడి నిర్మాణానికి సహకరించాలని గురువారం ఆమనగల్లులో వివిధ కార్యక్రమాలకు హాజరైన ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిని మాడ్గుల మండలంలోని నల్లచెర్వు గ్రామ యువకులు కోరారు. ఆయనను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కట్ట నరేందర్‌, కట్ట జంగయ్య, మహేష్‌, కట్ట రాములు, రామచంద్రయ్య, కట్ట రామస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:07:00+05:30 IST