విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-06-08T05:15:39+05:30 IST

విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

ఆమనగల్లు, జూన్‌ 7: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. పట్టణంలోని వివేకా విద్యాభారతి ఉన్నత పాఠశాలలో జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించిన జిల్లాస్థాయి సమ్మర్‌ వాలీబాల్‌ క్యాంప్‌ మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణస్పోర్ట్స్‌ ఆథారిటీ, హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ టీంల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ టీమ్‌కు ప్రథమ బహుమతి రూ.5వేలు, హాకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ టీమ్‌కు ద్వితీయ బహుమతి రూ.3500లు, ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్‌ సమకూర్చారు. వారంరోజులుగా సాగుతున్న ముగింపు టోర్నమెంట్‌లో 12టీమ్‌లు పాల్గొనగా విన్నర్‌గా మౌర్య, రాకేశ్‌, రన్నర్‌గా మౌలానిసా, అక్షర, తృతీయ బహుమతి రిషాలిషా, సురేఖ, నాల్గవ బహుమతి సాయి శ్రీ, నికేషిత్‌ టీమ్‌లు దక్కించుకున్నాయి. విజేతలకు నగదుతో పాటు షీల్డ్‌లను సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐ ధర్మేశ్‌, మార్కెట్‌చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, మహబూబ్‌నగర్‌ వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చెన్నవీరయ్య, కోశాధికారి దస్తగిరి ఖాన్‌ లతో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అందజేశారు. అనంతరం సమ్మర్‌ క్యాంప్‌ ఆర్గనైజర్‌ మల్లేశ్‌, వివేకా విద్యాభారతి కరస్పాండెంట్‌ మహమూద్‌ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో నారాయణ, సుభాష్‌, సయ్యద్‌ ఖలీల్‌, తిరుపతయ్య, వడ్డెమోని శివ, కృష్ణనాయక్‌, పీఈటీలు, కోచ్‌లు వీరారెడ్డి, పాండు, మల్లేశ్‌ పాల్గొన్నారు. 

11న కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

 ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణానికి ఈనెల 11న శంకుస్థాపన చేయనున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ తెలిపారు. కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2కోట్లు మంజూరు చేసిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఈ కార్యక్రమానికి ఎంపీ రాములు, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు హజరవుతారని ఆయన తెలిపారు. అదే రోజు దళితబంధు పథకం కింద ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు మంజూరైన ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

బీటీరోడ్ల ఆధునీకరణకు రూ.4.16కోట్లు  

 తలకొండపల్లి మండలంలో నాలుగు బీటీరోడ్ల మరమ్మతు, ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4.16 కోట్లు మంజూరు చేసిందని ఆమనగల్లు మార్కెట్‌చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడారు. ఇప్పటికే ఆయా పనులకు సంబంధించి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిందని పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.  కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ సహకారంతో రోడ్ల మరమ్మతుకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, నాయకులు సురమల్ల సుభాష్‌, సయ్యద్‌ ఖలీల్‌, వడె ్డమోని శివ, రవి, రాజు ఉన్నారు.  

Read more