మసీదుల్లో ఆలయాల ఆనవాళ్లపై ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి

ABN , First Publish Date - 2022-05-29T06:01:11+05:30 IST

మసీదుల్లో ఆలయాల ఆనవాళ్లపై ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి

మసీదుల్లో ఆలయాల ఆనవాళ్లపై ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌


శంషాబాద్‌, మే 28: మసీదుల్లో హిందూ దేవాలయాల ఆనవాళ్ల విషయమై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజలు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. శంషాబాద్‌ మున్సిపాలిటీలోని మల్లికా కన్వెన్షన్‌లో శనివారం బీజేపీ నాయకుడు బుక్కావేణుగోపాల్‌ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం డిజిటల్‌ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. భారత్‌లోని వారణాసి, కాశి, మధురై వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సమీపంలోని మసీదుల్లో ఆలయాల ఆనవాళ్లు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అక్కడ లభించే వస్తువుల ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం మురళీధర్‌రావు మాట్లాడుతూ.. దేశాల రాజకీయాలను విధానాలను సమర్థిస్తున్న పార్టీలు నాయకులందరి పట్ల కూడా సోషల్‌ మీడియా ద్వారా అప్రమత్తంగా ఉండాలనే ప్రచారానికి డిజిటల్‌ హిందూ సమ్మేళనం పిలుపునిస్తుందన్నారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి.నర్సింహారెడ్డి, డాక్టర్‌ ప్రేమ్‌రాజ్‌, అరవింద్‌, కుమార్‌, బుక్కాప్రవీణ్‌, చేవెళ్ల మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T06:01:11+05:30 IST