భార్యతో వివాహేతర సంబంధం ఉందని అన్న హత్య
ABN , First Publish Date - 2022-05-29T05:59:53+05:30 IST
భార్యతో వివాహేతర సంబంధం ఉందని అన్న హత్య

- కేసును ఛేదించిన పోలీసులు..
- నిందితుడి రిమాండ్
కొడంగల్, మే28 : తన భార్యకు సొంత అన్నతో వివాహేతర సంబం దం ఉందనే అనుమానంతో.. అన్నను తమ్ముడు హత్యచేసిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వికారాబాద్ అడిషనల్ ఎస్పీ రషీద్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ ఇఫ్తేకార్ అహ్మద్ శనివారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరా్‌సపేట్ మండలం ఏర్పుమళ్ల గ్రామానికి చెందిన పూజారి గోపాల్‌కు తన తమ్ముడి భార్యతో వివాహేతర సంబంధం ఉందనే నెపంతో 15-11-2021న ఇంట్లో నిద్రిస్తుండగా హత్యకు గురయ్యాడు. తమ్ముడు శ్రీను, పూజారిగోపాల్ మెడకు టవాల్‌ను గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం హత్య గురించి ఎవ్వరికీ తెలియకుండా మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి గ్రామ శివారులోని ఓ కుంటలో పడేశాడు. మృతుడి తండ్రి పూజారి రామయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి అనుమానితుడు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో సీఐ ఇఫ్తేకార్ అహ్మద్, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఎస్పీ ద్వారా రివార్డులు ప్రకటించనున్నట్లు అడిషనల్ ఎస్పీ రషీద్ తెలిపారు. సమావేశంలో కొడంగల్ ఎస్సై ఎ.రవి తదితరులు పాల్గొన్నారు.