ముడిమ్యాల్‌ సొసైటీ పనితీరు భేష్‌

ABN , First Publish Date - 2022-10-12T05:30:00+05:30 IST

ముడిమ్యాల్‌ సొసైటీ పనితీరు భేష్‌

ముడిమ్యాల్‌ సొసైటీ పనితీరు భేష్‌
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబి సీఈవో శ్రీనివాసులు

చేవెళ్ల, అక్టోబరు 12: ముడిమ్యాల ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం(ప్యాక్స్‌) పనితీరు బాగుందని డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీనివా్‌సలు, నాబార్డు డీడీవో ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం ముడిమ్యాల్‌ సొసైటీ సమావేశం చైర్మన్‌ గోనె ప్రతా్‌పరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో తిరిగి చెల్లించి సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. రుణాల్లో 50శాతం రికవరీ అయితే తప్ప కొత్త రుణాలు మంజూరు చేసేందుకు అవకాశం ఉందడన్నారు. రైతులకు గోదవరి డీఏపీ, నా గార్జున యూరియాను అందుబాటులో ఉంచేందుకు కృషిచే స్తామన్నారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ.. సహకార సొసైటీ నుంచి 1,423మంది రైతులకు రూ.10.2కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. రూ.3.1 కోట్ల గోల్డ్‌ లోన్లు ఇచ్చామన్నారు. సేవింగ్‌ ఖాతాల్లో రూ.12.67లక్షలు, కరెంట్‌ ఖాతాల్లో రూ.5.85లక్షలు, రూ.60లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయన్నారు. 

Read more