ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చాలి

ABN , First Publish Date - 2022-10-08T05:17:15+05:30 IST

ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చాలి

ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చాలి

 కులకచర్ల, అక్టోబరు 7: ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని ఆ సంఘం మండలాధ్యక్షుడు చంద్రలింగం ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండల పరిధిలోని రాంనగర్‌లో ముదిరాజ్‌ సంఘం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌లు విద్య, రాజకీయం, ఆర్థికంగా ఎదగాలన్నారు. అధ్యక్షుడిగా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా సంతోష్‌, ఉపాధ్యక్షులుగా భీమయ్య, హన్మంతు, కార్యదర్శులు వెంకటయ్య, పి.హన్మంతు, సభ్యులుగా తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు మైపాల్‌, బిచ్చన్న, గోపాల్‌, కె.మైపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T05:17:15+05:30 IST