మున్సిపల్‌ కార్మికుల కృషి మరువలేనిది

ABN , First Publish Date - 2022-10-08T05:22:40+05:30 IST

మున్సిపల్‌ కార్మికుల కృషి మరువలేనిది

మున్సిపల్‌ కార్మికుల కృషి మరువలేనిది
చైర్‌పర్సన్‌, కమిషనర్‌, సిబ్బందిని సన్మానిస్తున్న మాజీ సర్పంచ్‌ అబ్బసాని యాదగిరి

ఘట్‌కేసర్‌, అక్టోబరు 7 : మున్సిపాలిటీకి రెండవ సారి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు కావడానికి కార్మికులు చేసిన కృషి మరువలేనిదని ఘట్‌కేసర్‌ మాజీ సర్పంచ్‌ అబ్బసాని యాదగిరి అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద చైర్‌పర్సన్‌ పావనీ జంగయ్యయాదవ్‌ను, కమిషనర్‌ వసంతను మున్సిపల్‌ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన కార్మికులకు రూ.30వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య యువజన సంఘం నిర్వాహకులు పాల్గొన్నారు.


Read more