మాయమాటలతో మోసగిస్తున్న టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-09-21T05:30:00+05:30 IST

మాయమాటలతో మోసగిస్తున్న టీఆర్‌ఎస్‌

మాయమాటలతో మోసగిస్తున్న టీఆర్‌ఎస్‌
మర్పల్లిలో పార్టీ కార్యాలయం ఎదుట జెండా ఎగరవేస్తున్న మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌

మర్పల్లి, సెప్టెంబరు 21: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ పబ్బం గడుపుతోందని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు. బుధవారం మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మర్పల్లి చౌరస్తా నుంచి న్యూబస్టాండ్‌ వరకు కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలకు మద్దతు తెలిపారు. ఆతర్వాత పార్టీ కార్యాలయం ఎదుట జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాయమాటలతో ఒకరు రాజకీయం చేస్తుంటే, మరొకరు మతాల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చాక వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీ బూత్‌కు 30 మంది చొప్పున కార్యకర్తలను సిద్ధం చేస్తున్నామన్నారు. మర్పల్లి మండల అధ్యక్షుడు రవీందర్‌, బ్లాక్‌-2 కృష్ణారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సత్యం, అయూబ్‌ అన్సారీ, రఫీయోద్దీన్‌, సురేశ్‌, రాచన్న, ప్రభాకర్‌, సంజీవ్‌రెడ్డి, శ్రీనివాస్‌, రాఘవేందర్‌, జనార్ధన్‌రెడ్డి, సంతో్‌షరెడ్డి, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-21T05:30:00+05:30 IST