లౌకిక పరిరక్షణకు ఉద్యమించాలి

ABN , First Publish Date - 2022-10-04T05:40:13+05:30 IST

లౌకిక పరిరక్షణకు ఉద్యమించాలి

లౌకిక పరిరక్షణకు ఉద్యమించాలి
మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీపీఐ నాయకులు

మేడ్చల్‌ అర్బన్‌, అక్టోబర్‌ 3:  బీజేపీ మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా లౌకిక పరిరక్షణ కోసం అందరు ఉద్యమించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్‌. బాలమల్లేష్‌ అన్నారు. సోమవారం ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ఈనెల 14 నుంచి 18 వరకు విజయవాడలో జరుగనున్న సీపీఐ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి డీజీ సాయిలుగౌడ్‌ మాట్లాడుతూ జాతీయ మహాసభల గౌరవార్థం ఈనెల 7న హిమాయత్‌నగర్‌లో సెమినార్‌కు జిల్లా నుంచి భారీగా తరలివెళ్లాలని కోరారు. అనంతరం మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు దామోదర్‌రెడ్డి, ఉమామహేష్‌, దశరథ, కృష్ణమూర్తి, లక్ష్మీ, శంకర్‌, స్వామి, శంకర్‌రావు, దర్మేంద్ర, కిషన్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more