అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతురు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-10-07T05:46:20+05:30 IST
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతురు ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, అక్టోబరు 6: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో తల్లీ కూతురు ఆత్మహత్మకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఇబ్రహీంపట్నం టౌన్ వెంకటరమణ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వెంకటరమణ కాలనీలో నివాసముంటున్న ఏదుల్ల ఆగమ్మ (55)కు కూతురు మనోహర (30), కుమారుడు రాందా్సలు ఉన్నారు. కాగా కూతురు మనోహరకు పెళ్లైనప్పటికీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకుని తల్లివద్దనే ఉంటోంది. పైగా నాలుగేళ్లుగా మనోహర పక్షవాతంతో బాఽధపడుతోంది. కొడుకు రాందాస్ తల్లీ, సోదరిని పట్టించుకోకుండా ఉన్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. మనస్తాపానికి గురైన తల్లీ కూతురు ఇంటి పైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో గురువారం ఇరుగు పొరుగువారు తలుపులు బద్దలుకొట్టి చూడగా తల్లీకూతురు ఉరేసుకొని కనిపించారు. మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి. 4, 5రోజుల క్రితమే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అంందుకున్న పోలీసులు ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.