మంత్రి హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-10-18T05:19:16+05:30 IST

మంత్రి హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే

మంత్రి హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే
మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే

ఆమనగల్లు ,  అక్టోబరు 17: రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌ రావును సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, ఆమనగల్లు, వెల్దండ, మైసిగండి, మాడ్గుల, గట్టిప్పలపల్లి, తలకొండపల్లి, ఇర్విన్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన, ఖాళీగా ఉన్న వైద్యుల, సిబ్బంది పోస్టుల భర్తీ, కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా గొర్రెల కాపరులకు రెండవ విడత గొర్రెల యూనిట్ల కొనుగోలుకు రూ.600కోట్లు సీఎం కేసీఆర్‌ ద్వారా ఆమోదింపజేసినందుకు మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపినట్లు జైపాల్‌యాదవ్‌ తెలిపారు. 

Updated Date - 2022-10-18T05:19:16+05:30 IST