రోడ్లు నిర్మించిన తరువాతే ఓట్లు అడుగుతాం

ABN , First Publish Date - 2022-09-27T05:57:11+05:30 IST

రోడ్లు నిర్మించిన తరువాతే ఓట్లు అడుగుతాం

రోడ్లు నిర్మించిన తరువాతే ఓట్లు అడుగుతాం
రైతులకు శనగ విత్తనాలు అందజేస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పూడూర్‌, సెప్టెంబరు, 26: గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం చన్‌గోముల్‌లో రైతులకు ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రంలో శనగ విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం కడుమూర్‌, మిట్టకంకల్‌, మేడిపల్లికలాన్‌ గ్రామాల్లో బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్‌ కార్డులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో బీటీ రోడ్ల నిర్మా ణం చేపట్టే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు అనిల్‌రెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, పరిగి మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజహర్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read more