జీతాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన
ABN , First Publish Date - 2022-12-31T00:04:13+05:30 IST
మిషన్ భగీరథ శాఖలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని శుక్రవారం జాఫర్‌పల్లిలోని ఎంబీ ప్లాంట్ వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
పరిగి, డిసెంబరు 30: మిషన్ భగీరథ శాఖలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని శుక్రవారం జాఫర్‌పల్లిలోని ఎంబీ ప్లాంట్ వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల నిరసనకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎం.లాల్‌కృష్ణప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లాల్‌కృష్ణ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ తాత్కాలిక ఉద్యోగులకు నాలుగైదు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా జీవనం గడుస్తాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రతీ నెలా రావాల్సిన వేతనాలు నెలల తరబడి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే సిబ్బందికి వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.