కృష్ణ కృష్ణా..!

ABN , First Publish Date - 2022-08-05T04:38:30+05:30 IST

మండల పరిధిలోని కొత్తూరు గేట్‌ వద్ద మిషన్‌ భగీరథ

కృష్ణ కృష్ణా..!
కొత్తూరు గేటు వద్ద కృష్ణావాటర్‌ పైపులైన్‌ పగిలి వృథాగా పోతున్న నీరు

  • కొత్తూరు గేటు వద్ద పగిలిన మిషన్‌ భగీరథ పైపులైన్‌

కందుకూరు, ఆగష్ఠు 4: మండల పరిధిలోని కొత్తూరు గేట్‌ వద్ద మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలి నీరంతా వృథాగా పోయింది. లీకైన నీరు ఫౌంటెయిన్‌ మాదిరిగా ఎగిరిపడుతుండటంతో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు, మండల ప్రజలు వింతగా తిలకించారు. ముచ్చర్ల నీటిశుద్ధి కేంద్రం నుంచి శంషాబాద్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఈ పైప్‌ లైన్‌ ద్వారా నీరు సరఫరా అవుతుంది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు రెండు గంటల అనంతరం నీటిని నిలిపివేశారు.

కృష్ణానీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలి : మంత్రి  సబితారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న ఇంటింటికీ నల్లా ద్వార అందిస్తున్న కృష్ణానీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సంబంధిత అఽధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని కొత్తూరు గేటు వద్ద కృష్ణానీటి పైపులైన్‌ పగిలింది. అదేసమ యంలో మంత్రి కందు కూరులో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల శాఖ అధ్యక్షుడు కొలన్‌ విఘ్నేశ్వర్‌రెడ్డి తమ్ముడి వివాహానికి వెళ్తుండగా కృష్ణానీరు హైవేపై వృథాగా పోతుండడం చూసి వెంటనే కాన్వాయి ఆపారు. సంబంధిత అధికా రులకు సమాచారం అందించి ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, అందుగుల సత్యనారాయణ, జి.లక్ష్మీనర్సింహ్మరెడ్డి, బర్కం వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-05T04:38:30+05:30 IST