మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2022-10-08T04:20:22+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో  మంత్రి మల్లారెడ్డి
ప్రచారంలో భాగంగా ఓటర్లతో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ అక్టోబరు7,(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వచ్చే నెల 3న జరుగనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో రాష్ట్రకార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం పాల్గొన్నారు.  చౌటుప్పల్‌ మండలం పరిధిలోని కాట్రేవు, అరెగూడెం, గుండ్లబావి తదితర గ్రామాల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. రైతులు, మహిళలతో  మాట్లాడారు. మేడ్చల్‌ నియోజకవర్గం, ఫీర్జాదిగూడ, బోడుప్పల్‌కు చెందిన  టీఆర్‌ఎస్‌ నేతలు కూడా మంత్రి వెంట మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి తరలివెళ్లారు. 

Updated Date - 2022-10-08T04:20:22+05:30 IST