పోల్కంపల్లిలో మెగా వైద్య శిబిరం

ABN , First Publish Date - 2022-10-18T05:24:36+05:30 IST

పోల్కంపల్లిలో మెగా వైద్య శిబిరం

పోల్కంపల్లిలో మెగా వైద్య శిబిరం
ఏన్గల్‌గూడలో రోగులను పరీక్షిస్తున్న వైద్యులు

ఇబ్రహీంపట్నం, అక్టోబరు 17: పోల్కంపల్లి పంచాయతీ ఏన్గల్‌గూడలో వనస్థలిపురం, ఎల్బీనగర్‌, మీర్‌పేట్‌, రాగన్నగూడ, ఇబ్రహీంపట్నం లయన్స్‌ క్లబ్‌లు (జోన్‌ లెవల్‌) సంయుక్తంగా సోమవారం మెగా వైద్య శిబిరం నిర్వహించాయి. సుమారు 200మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు లయన్‌ క్లబ్‌ జోన్‌ పర్సన్‌ సాధు శ్యాంప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ డిస్టిక్‌ గవర్నర్‌ వెంకటనారాయణరెడ్డి, రీజియన్‌ చైర్‌పర్సన్‌ సంపత్‌గౌడ్‌, వనస్థలిపురం లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ మారంనాజు రాంచందర్‌రావు, ఇబ్రహీంపట్నం క్లబ్‌ అధ్యక్షుడు చింతం బాల్‌రాజ్‌ యాదవ్‌, పీఆర్‌వో నెల్లి అశోక్‌కుమార్‌, ఇన్నారెడ్డి, చిన్నగంట లచ్చిరెడ్డి, సంధ్యారాణి పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:24:36+05:30 IST