వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-12T05:15:26+05:30 IST

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మోమిన్‌పేట్‌ : పరీక్షలు చేస్తున్న వైద్యులు

మోమిన్‌పేట్‌/పూడూర్‌,  అక్టోబరు 11: ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మోమిన్‌పేట్‌ సొసైటీ చైర్మన్‌ బి.విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మోమిన్‌పేట మండలం టేకులపల్లిలో ఎంఎన్‌ఆర్‌ ఆసుపత్రి సంగారెడ్డి వారి ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. 80 మందికి బీపీ, షుగర్‌, నేత్ర తదితర సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్‌ బి.నవనీత, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజుగౌడ్‌, జయకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. పూడూర్‌ మండలం సోమన్‌గుర్తిలో నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌లో భాగంగా సర్పంచ్‌ సంధ్యాభాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ సిరిదేవిక ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు సులోచన పాఠశాల విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, గర్భిణి స్త్రీలు తీసుకునే పోషక ఆహార పదార్థలపై సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు గాయత్రి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, శంకరయ్య, సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


Read more