ప్రమాదాల నివారణకు చర్యలు

ABN , First Publish Date - 2022-10-07T05:48:51+05:30 IST

ప్రమాదాల నివారణకు చర్యలు

ప్రమాదాల నివారణకు చర్యలు

  • సుతారిగూడ చెరువు కట్టపై కడీలు నాటిన ట్రాఫిక్‌ పోలీసులు

 మేడ్చల్‌ అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మేడ్చల్‌లో ప్రమాదాలు నివారించే దిశగా ట్రాఫిక్‌ పోలీసులు నడుం బిగించారు. మేడ్చల్‌లో నూతనంగా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశాక సీఐ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్‌ చెక్‌పోస్టు నుంచి గండిమైసమ్మ వెళ్లే దారిలో సుతారిగూడ చెరువు వద్ద ప్రమాదకరంగా ఉండటంతో స్వయంగా ట్రాఫిక్‌ పోలీసులు చెరువు కట్టపై రోడ్డు పక్కన కడీలు నాటారు. సుతారిగూడ చెరువులో గతంలో జరిగిన ప్రమాదాల్లో వాహనాలు చెరువులోకి కూడా దూసుకువెళ్లాయి. దీనితో పోలీసులు రక్షణగా కడీలు ఏర్పాటు చేశారు. పోలీసులు స్వయంగా కడీలు నాటడం చూసిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు చేపడుతున్న చర్యలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-10-07T05:48:51+05:30 IST