ప్రమాదవశాత్తు బావిలో పడి వివాహిత మృతి
ABN , First Publish Date - 2022-12-16T23:49:18+05:30 IST
ప్రమాదవశాత్తు బావిలో పడి వివాహిత మహిళ మృతిచెందింది.
కులకచర్ల, డిసెంబరు 16: ప్రమాదవశాత్తు బావిలో పడి వివాహిత మహిళ మృతిచెందింది. గ్రామస్తుల వివరాల మేరకు.. చౌడాపూర్ మండలం బంగరంపల్లికి చెందిన గొల్ల వెంకటయ్య మొదటి భార్య పెద్దవెంకటమ్మకు సంతానం కలగకపోవడంతో ఆమె చెల్లెలు రాంరెడ్డిపల్లికి చెందిన నాగమ్మ(28)ను రెండో వివాహం చేసుకున్నాడు. నాగమ్మకు కుమారుడు, కూతురు ఉన్నారు. శుక్రవారం ఉదయం నాగమ్మ బట్టలుతికేందుకు బావి వద్దకు వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవ డంతో బావివద్ద వెళ్లి చూశారు. బావిలో దిగి గాలించగా శవం లభ్యమైంది. నాగమ్మ కాలుజారి బావిలో పడి ఉంటుందని కుటుంబీకులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నవాపేట్ పోలీస్‌లు కేసు నమోదు చేశారు.