గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-07-06T05:08:49+05:30 IST

గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత
ఎక్సైజ్‌ పోలీసుల అదుపులో నిందితుడు భార్గవ్‌రెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎక్సైజ్‌ సీఐ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధి కాప్రా సమీపంలోని ఏఎస్‌ రావునగర్‌ చౌరస్తాలో మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ ద్విచక్రవాహనం(టీఎస్‌ 08 జీవో 0561)లో 510 గ్రాముల  గంజాయి పట్టుపడింది. దీంతో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని విచారించగా. అహ్మద్‌గూడ రాజీవ్‌గృహకల్ప కాలనీకి చెందిన నల్లమాడి భార్గవ్‌రెడ్డి(22)గా పేర్కొన్నాడు. కాగా, అతడు గుట్టచప్పుడు కాకుండా ఏపీలోని అరకు ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి తీసుకొచ్చి ఏఎ్‌సరావు నగర్‌ ప్రాంతంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో  తేలింది.  గంజాయితో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్‌ సీఐ తెలిపారు.

Read more