సమస్యల ఏకరువు

ABN , First Publish Date - 2022-05-19T05:20:55+05:30 IST

సమస్యల ఏకరువు

సమస్యల ఏకరువు
కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల వాగ్వాదం

  • కడ్తాల్‌లో మిషన్‌ భగీరథ నీరు రావడం లేదని సమావేశంలో ఎంపీటీసీ మండిపాటు

కడ్తాల్‌, మే 18: కడ్తాల్‌ మండల పరిషత్‌ సర్వస భ్య సమావేశం బుధవారం ఎంపీపీ కమ్లీమోత్య అ ధ్యక్షతన నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ ముఖ్య అతిథుగా హాజరైన సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గ్రామాల్లో తాము, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. సభ్యుల ఆగ్రహావేశాలు, నిరసనలు, వాదోపవాదాల మధ్య సమావేశం కొనసాగింది. గందరగోళం నెలకొనడంతో పోలీసులు వచ్చి చేసి సభ్యులను సముదాయించారు. మండల కో-ఆప్షన్‌ స భ్యుడు జహంగీర్‌బాబ కడ్తాల పంచాయతీ వార్డుల్లో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఖాళీ బిందెలతో సమావేశంలో బైటాయించారు. నల్లా నీరు సరఫరా అ వుతున్నా రాజకీయం చేసేందుకే ఇలా చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ లచ్చిరామ్‌ కాంగ్రెస్‌ సభ్యులతో వాదనకు దిగారు. కడ్తాలలో నీరు సక్రమంగా వస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామాకు చేస్తా అని కాంగ్రెస్‌ ఎంపీటీసీ గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు అన్నారు. సభలో గందరగోళం నెలకొనగా ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌ వచ్చి సముదాయించారు. సమస్య ఉంటే వెంటనే పరి ష్కరించాలని ఎమ్మెల్యే ఎంబీ డీఈ సుదర్శన్‌, ఏఈ వాగ్దే విని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విధిగా ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. వడగళ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలని ఎంపీటీసీ శ్రీనివా్‌సరెడ్డి కోరారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో మదుసూధనచారి, ఎంఈవో సర్దార్‌ నాయక్‌, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఏవో శ్రీలత, ఏపీఎం రాజేశ్వరి పాల్గొన్నారు. 


  • బిల్లులివ్వక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది : ఎక్వాయిపల్లి సర్పంచ్‌ సుగుణ ఆవేదన

ఎక్వాయిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులకు నెలలుగా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని, పనుల కోసం తన బంగారు నగలు తాకట్టు పెట్టి ముత్తూట్‌ పైనాన్స్‌లో లోన్‌, ప్రైవేట్‌గా అప్పులు తెచ్చామని, వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని సర్పంచ్‌ జంగం సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏం సర్పంచ్‌ పదవి అంటూ నిరాశకు లోనయ్యారు. పంచాయతీ అకౌంట్‌లో రూ.10లక్షల వరకూ ఉన్నా ఎస్టీవోలో ఒక్క చెక్కూ పాస్‌కాక రిటర్న్‌ వస్తున్నాయని పేర్కొన్నారు. తమకు రూ.3.5లక్షల బిల్లులు రావాల్సి ఉందని 9నెలలుగా ఇవ్వడం లేదని సర్పంచ్‌ వాపోయారు. పంచాయతీ ట్రాక్టర్‌ డీజి ల్‌ పైసలు కూడా ఇవ్వడం లేదని సర్పంచ్‌లు తులసీరామ్‌, యాదయ్య, కృష్ణయ్య, హరిచంద్‌, సుగుణ సభదృ ష్టికి తెచ్చారు. సర్పంచ్‌ల ఇబ్బందులను ముఖ్యమంత్రికి తెలిపి పెండింగ్‌ బిల్లులొచ్చేలా చేస్తానని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే జైపాల్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2022-05-19T05:20:55+05:30 IST