రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొత్తకోట, మార్చి 5: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని జాతీయ రహదారిపై గల విలియంకొండ గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చెందిన సురేష్‌(32) నాగర్‌కర్నూల్‌ జిల్లా పెట్టవెళ్లి గ్రామానికి చెందిన చందు బైక్‌పై స్వగ్రామానికి వెళ్లడానికి రహదారిని దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు వెళ్తున్న డీసీఎం ఢీకొంది. గాయాలైన ఇద్దరిని స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్‌ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగశేఖర్‌రెడ్డి తెలిపారు. 

Read more