వైన్స్‌లో మద్యం తాగుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-12-12T23:51:10+05:30 IST

ఓ మద్యం దుకాణం వద్ద పర్మిట్‌ రూమ్‌లో మద్యం తాగుతున్న వ్యక్తి గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందాడు.

వైన్స్‌లో మద్యం తాగుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి
సత్యనారాయణ మృతదేహం

అలియాబాద్‌లో ఘటన

శామీర్‌పేట, డిసెంబరు 12: ఓ మద్యం దుకాణం వద్ద పర్మిట్‌ రూమ్‌లో మద్యం తాగుతున్న వ్యక్తి గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం 3గంటలకు శామీర్‌పేట మండలం అలియాబాద్‌లోని శ్రీవెంకటేశ్వర్‌ వైన్స్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలియాబాద్‌కు చెందిన దేవి సత్యనారాయణ(57) గ్రామంలోని వెంకటేశ్వరవైన్స్‌లోని పర్మిట్‌ రూమ్‌లో మద్యం తాగుతున్నాడు. ఆ సమయంలో అతడికి గుండెపోటు వచ్చి కుర్చిలోనే మృతిచెందాడు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా చేసి పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-12-12T23:51:10+05:30 IST

Read more