జాలి(దొంగ) నోట్లు ఉన్నాయంటూ బురిడీ

ABN , First Publish Date - 2022-10-04T05:46:05+05:30 IST

జాలి(దొంగ) నోట్లు ఉన్నాయంటూ బురిడీ

జాలి(దొంగ) నోట్లు ఉన్నాయంటూ బురిడీ
బాధితుడితో మాట్లాడుతున్న పోలీసులు

  • రూ.7,500తో ఉడాయించిన కేటుగాడు

తాండూరు, అక్టోబరు 3: జాలి నోట్లు అని మాయమాటలు చెప్పి ఓ దుండగు డు రూ.7500లతో ఊడాయించాడు. ఈ సంఘటన సోమవారం తాండూరులోని ఎస్‌బీఐలో చోటు చేసుకుంది. సాయిపూర్‌ ప్రాంతానికి చెందిన గిరిబాబు సాహుకార్‌పేట్‌లోని ఎస్‌బీఐ మెయిన్‌బ్రాంచ్‌ బ్యాంకు వెళ్లి రూ.22వేలు డ్రా చేశాడు. అప్పటికే బ్యాంకులో తచ్చాడుతున్న ఓ గుర్తుతెలియ ని వ్యక్తి గిరిబాబు వద్దకు వచ్చి బ్యాంకు అధికారులు జాలినోట్లు ఇచ్చారేమో సరిగా చూసుకోవాలంటూ గిరిబాబుతో అన్నాడు. అతడి మాటలు నమ్మిన గిరిబాబు డబ్బులు లెక్కించే ప్రయత్నం చేగాయ.. గుర్తుతెలియని వ్యక్తి అతడి నుంచి రూ.7500 లాక్కొని పరారయ్యాడు. అప్పటికే బ్యాంక్‌ బయట బైక్‌తో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి పారిపోయాడు. గిరిబాబు కేకలు వేసినా ఉపయోగం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు చేరుకొ ని బాధితుడితో మాట్లాడారు. నిందితులు ముర్షద్‌ దర్గా వైపు వెళ్లినట్లు గిరిబాబు తెలుపగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more