మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతాం

ABN , First Publish Date - 2022-07-07T05:49:14+05:30 IST

మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతాం

మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతాం
ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ

ఆమనగల్లు, జూలై 6: మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని అభివృద్ధి పరిచి ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యా టక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి  అన్నారు. సీఎం కేసీఆర్‌ పురాతన ఆలయాల పునరుద్ధరణకు, దైవ కార్య క్రమాలకు, పర్యాటక ప్రాంతాల అభి వృద్దికి పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకుడు భాస్కర్‌ నారాయణరెడ్డిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆలయం వద్ద రూ.70లక్షలతో నిర్మస్తున్న ప్రహరీ నిర్మాణం పనులను ఎమ్మెల్సీ పరిశీలించారు. పనులు నాణ్యతగా, వేగవంతంగా చేపట్టాలని సూచించారు. మైసమ్మ ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వపరంగా తనవంతు కృషి చేస్తానని నారాయణరెడ్డి పేర్కొన్నారు. దైవకార్యక్రమాలు విశ్వశాంతికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, నాయకులు సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, హన్మానాయక్‌, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నరేశ్‌నాయక్‌, బాబా, జంతుక అల్లాజీ తదితరులు పాల్గొన్నారు.

Read more