కనుల పండువగా మహా పడిపూజ
ABN , First Publish Date - 2022-12-15T23:46:26+05:30 IST
శంకర్ మండలంలోని పొద్దటూరు, షాబాద్ మండలంలోని నరెడ్లగూడ గ్రామాలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి.
శంకర్‌పల్లి/షాబాద్/ఆమనగల్లు, డిసెంబరు 15: శంకర్ మండలంలోని పొద్దటూరు, షాబాద్ మండలంలోని నరెడ్లగూడ గ్రామాలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. పొద్దటూరులో కావెలి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహాపడిపూజను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎ్‌స.రత్నం పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. అదేవిధంగా షాబాద్ మండల పరిధిలో నరెడ్లగూడ గ్రామంలో బీసీ సేనా జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ ఇంట్లో దర్పల్లి రవీందర్ గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప పూజను వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, నాయకులు చంద్రమోహన్‌రెడ్డి, ఉదయ్‌మోహన్‌రెడ్డి, బండ నర్సింహ పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల మండలం కొండ్రిగాని బోడు తండాలో గురువారం అయ్యప్ప మహాపడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బిక్యునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజలో భక్తులు, అయ్యప్ప మాలధారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గణపతిపూజ, అభిషేకాలు, పడిపూజ కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆయనను సత్కరించారు. అదేవిధంగా భక్తులకు అన్నదానం చేశారు.