కులకచర్ల వైద్యాధికారిగా మాధురి
ABN , First Publish Date - 2022-12-07T23:39:52+05:30 IST
కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిగా మాధురి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
కులకచర్ల, డిసెంబరు 7: కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిగా మాధురి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న వైద్యాధికారి మురళీకృష్ణ ఖమ్మం మెడికల్ కాలేజీలో పీజీ చేయడానికి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తానని నూతన వైద్యాధికారిని మాధురి తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌వో చంద్రప్రకాశ్, వైద్యసిబ్బంది ఉన్నారు.