లైఫ్‌ స్కిల్స్‌ వివరించిన కేజీఎ్‌ఫ-2

ABN , First Publish Date - 2022-12-16T23:19:23+05:30 IST

నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచే నిరంతర ప్రయత్నమే జీవిత నైపుణ్యమని నిలకంఠాపురం బాలకృష్ణ, వల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు.

లైఫ్‌ స్కిల్స్‌ వివరించిన కేజీఎ్‌ఫ-2
శామీర్‌పేటలోని జగద్గిరిగుట్ట డిగ్రీ కళాశాలకు విచ్చేసిన కేజిఎ్‌ఫటు ఫేమ్‌తో అధ్యాపకులు

శామీర్‌పేట, డిసెంబరు 16 : నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచే నిరంతర ప్రయత్నమే జీవిత నైపుణ్యమని నిలకంఠాపురం బాలకృష్ణ, వల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం శామీర్‌పేటలోని జగద్గిరిగుట్ట మహిళ డిగ్రీ గురుకుల కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు లైఫ్‌ స్కిల్స్‌ జీవిత నైపుణ్యాల గురించి వివరించారు. విద్యార్థులు తన జీవితాన్ని చక్కగా, సమర్థవంతంగా జీవించుటకు నైపుణ్యాలను అభివృద్దిపర్చుకోవాలన్నారు. కేజీఎ్‌ఫటూ సినిమాలోని పలు డైలాగ్‌లను వినిపించారు. అనుభవాలను గురించి వివరించారు. బిజినెస్‌ మ్యాన్‌ అయినప్పటికీ సినిమా ఫీల్డ్‌కి రావడానికి గల కారణాలను తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇష్రత్‌, అధ్యాపకులు వారిని శాలువాలతో సత్కరించారు.

Updated Date - 2022-12-16T23:19:24+05:30 IST