టీఆర్‌ఎ్‌సను బలోపేతం చేద్దాం

ABN , First Publish Date - 2022-11-30T00:11:17+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషిచే యాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు అన్నారు.

టీఆర్‌ఎ్‌సను బలోపేతం చేద్దాం
కేశంపేట: కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పల్లె నర్సింగరావు

ఇబ్రహీంపట్నం/కేశంపేట/కొత్తూర్‌,నవంబరు 29: టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషిచే యాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు అన్నారు. పల్లె పల్లెకూ టీఆర్‌ఎ్‌సలో భాగంగా మంగళవారం పొ ల్కంపల్లి, నాగన్‌పల్లిలో కార్యకర్తల సమావేశాల్లో మా ట్లాడారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందన్నారు. పొల్కంపల్లి సర్పంచ్‌ అండాలుగిరి, ఎంపీటీసీ రవీంద ర్‌, ప్యాక్స్‌ చైర్మర్‌ వెంకట్రెడ్డి, మంద సురేష్‌, నర్సింహ, కె.ప్రభాకర్‌రెడ్డి, బీరప్ప పాల్గొన్నారు. కేశంపేట మం డలం దత్తాయపల్లి, పోమాల్‌పల్లి గ్రామాల్లో మాజీ జడ్పీటీసీ నర్సింగరావ్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మండల అధ్యక్షుడు మురళీధర్‌రె డ్డి, నవీన్‌కుమార్‌, భూపాల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, యాద య్య, కృష్ణయ్య, రామయ్య, సత్యం పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పాటు పడాలని కొత్తూర్‌ మండల టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, బి.దేవేందర్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ, కొడిచర్ల, కొడిచర్లతండాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు వేర్వేరుగాసమావేశాలు నిర్వహించి బూత్‌ కమిటీలను నియమించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ డోలీ రవీందర్‌, ఎంపీటీసీలు రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ సంతో్‌షనాయక్‌ రాజేందర్‌గౌడ్‌, కౌన్సిలర్‌ కోస్గి శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు.

============

Updated Date - 2022-11-30T00:11:17+05:30 IST

Read more