‘మాణిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం’

ABN , First Publish Date - 2022-10-17T05:30:00+05:30 IST

‘మాణిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం’

‘మాణిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం’

కొడంగల్‌, అక్టోబరు 17: విద్యారంగం, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృ షిచేస్తూ ఉద్యమంలో అనుభవం కలిగిన ప్రశ్నించే గొంతుక పాపన్నగారి మాణిక్‌రెడ్డిని మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం అని టీఎస్‌ యూటీఎఫ్‌ వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప పిలుపునిచ్చారు. సోమవారం పెద్దనందిగామ, హస్నాబాద్‌, పర్సాపూర్‌, హుసేన్‌పూర్‌, గుండ్లపల్లి తదితర గ్రామాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు మత్త్యప్ప, బసప్ప, అశోక్‌, శ్రీనివాస్‌, అంజానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST