ఆర్టీసీని అభివృద్ధి పథంలోకి తీసుకుపోదాం

ABN , First Publish Date - 2022-09-11T05:03:44+05:30 IST

ఆర్టీసీని అభివృద్ధి పథంలోకి తీసుకుపోదాం

ఆర్టీసీని అభివృద్ధి పథంలోకి తీసుకుపోదాం
ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో ప్రదర్శనలిస్తున్న ఆర్టీసీ కళాబృందం సభ్యులు

  • హైదరాబాద్‌ డిప్యూటీ ఆర్‌ఎం కిరణ్‌  
  • ఇబ్రహీంపట్నంలో కళాజాత

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్‌ 10: టీఎస్‌ ఆర్టీసీని అభివృద్ధిలో పథంలోకి తీసుకుపోదాం అని, ఈ బాధ్యత ఉద్యోగులు, ప్రయాణికులపై ఉందని హైదరాబాద్‌ డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ కె.కిరణ్‌ అన్నారు. సేవల విషయంలో దేశంలోనే టీఎస్‌ ఆర్టీసీకి విశేష గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. ఆర్టీసీ కళాబృందం శనివారం ఇబ్రహీంపట్నం బస్టాండ్‌, అంబేద్కర్‌ చౌరస్తా వద్ద కళాజాత ప్రదర్శనలిచ్చింది. ఆర్టీసీ కల్పిస్తున్న రాయితీలు, రవాణా సదుపాయాలపై కళాకారులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌ కె.రమేష్‌, ఎస్టీఐ సౌజన్య, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Read more