రేవంత్‌రెడ్డిని కలిసిన నేతలు
ABN , First Publish Date - 2022-10-07T06:13:40+05:30 IST
రేవంత్‌రెడ్డిని కలిసిన నేతలు
ఆమనగల్లు/షాద్‌నగర్ అర్బన్, ఆక్టోబరు 6: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డిని గురువారం ఆమనగల్లు మండల యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని ఆయన నివాసంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు వస్పుల శ్రీకాంత్, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు ఫరీద్ ఆధ్వర్యంలో కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రేవంత్‌రెడ్డి సూచించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా షాద్‌నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెంది తిరుపతిరెడ్డి కొండారెడ్డిపల్లిలో రేవంత్‌రెడ్డిని కలిసి సన్మానించారు.